వచ్చే నెల డిసెంబర్(మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి.