ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమీండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.