దక్షిణభారతంలోని అందమైన దేవాలయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మన దేవాలయాల చరిత్ర చాలా పురాతనమైనది ఆయన అన్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేడు 55 శాతం మంది ప్రజలు ధర్మ పర్యటన చేస్తున్నారని చెప్పారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఆచరించడం మనందరి కర్తవ్యమని చెప్పారు.