జపాన్‌లో ఇంటిని నిర్వహించడమే కాకుండా, కుటుంబ ఆర్థిక వ్యవహారాలను కూడా భార్యలే చాలా బాధ్యతగా చూసుకుంటారట. అక్కడ కొందరు భర్తలు తమ సంపూర్ణ జీతాన్ని భార్యలకు అప్పగించడం సాధారణం. ఈ మొత్తం ద్వారా భార్యలు ఇంటి ఖర్చులు నిర్వహించడంతో పాటు భర్తలకు 'పాకెట్ మనీ'గా కొంత ఇస్తారట. ఈ విధానాన్ని 'ఓకోజుకై' అనే పిలుస్తారు. అయితే, ప్రస్తుత కాలంలో భర్త భార్యలిద్దరు సంపాదించడం వల్ల ఈ సంప్రదాయం నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందట.