దాదాపు 27 ఏళ్ల అనంతరం దక్షిణాఫ్రికా మరోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఈ ఘనత సాధించింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇది సఫారీ జట్టుకు రెండో ఐసీసీ టైటిల్. కాగా, కెప్టెన్ తెంబా బావుమా తన కుమారుడితో కలిసి మైదానంలో సంబరాలు చేసుకుంటూ గదను ఆయన చేతికి ఇచ్చిన క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.