TG: రేవంత్ సర్కార్ అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లు దాటింది. కొత్తవారికి మంజూరు చేయడంతోపాటు.. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుతుండటంతో మే నెలాఖరు నాటికి లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921కి చేరుకుంది. నాలుగు విడతల్లో కొత్తగా 2,03,156 కార్డులు మంజూరు చేశారు. పాత కార్డుల్లో కొత్త సభ్యులుగా 29,81,356 మంది పేర్లను నమోదు చేశారు.