నా మీద కూడా కేసులున్నాయి: మంత్రి పొన్నం

81చూసినవారు
నా మీద కూడా కేసులున్నాయి: మంత్రి పొన్నం
తన మీద కూడా చాలా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ.. 'ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాల సమస్యలను మార్చి తరువాత పరిష్కరిస్తాం. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌లకు సంబంధించి స్థానికులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతా. సీఎంతో పాటు నా మీద కూడా కేసులు ఉన్నాయి' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్