భోజనం చేశాక నడిస్తే ఎన్నో లాభాలు

82చూసినవారు
భోజనం చేశాక నడిస్తే ఎన్నో లాభాలు
భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఇది అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడక చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇటీవల స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం ప్రకారం, భోజనం తర్వాత నడక వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గి శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్