కాకరకాయతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయను తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. బరువు తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కాకరకాయ తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.