యుద్ధంలో ఆశ్విక దళం అత్యంత కీలకం. ఆ బలంతోనే చెంఘిజ్ ఖాన్ అనే రాజు అనేక యుద్ధాలు గెలిచాడు. అందుకే ఆయన పాలించిన మంగోలియాలో గుర్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ప్రతి వ్యక్తికి ఒక గుర్రం ఉంటుంది. ఆ దేశ జనాభా 34 లక్షలైతే, గుర్రాల సంఖ్య 40లక్షలకు పైమాటే. మంగోలియా గుర్రాలు చిన్నవిగా ఉన్నా.. చాలా బలమైనవి, తెలివైనవి. ఒకసారి ఒక మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటాయని స్థానికులు చెబుతారు.