సినీ ఇండస్ట్రీలో కాంపౌండ్‌లు లేవని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. "విశ్వక్‌సేన్ సినిమా ఫంక్షన్‌కు వెళ్తున్నారా? అతడు బాలకృష్ణ మనిషి అని కొందరు నాతో అన్నారు. విశ్వక్.. మన ఇండస్ట్రీలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అని అనుకోవాలని వారితో చెప్పా. నేను, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ కలిసి కట్టుగా ఉంటాం." అని చిరు అన్నారు.