రాజస్థాన్‌లోని రామ్‌దేవర బస్తీ అనే గ్రామంలోని పురుషులు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటారని సమాచారం. ఈ ఆచారం అక్కడ ఆనవాయితీగా ఉన్నదట. ఈ గ్రామంలోని పురుషులు తమ మొదటి భార్య గర్భం దాల్చలేదని నమ్ముతారు. ఒకవేళ గర్భం దాల్చినా.. ఆడపిల్లే పుడతారట. ఈ కారణంగానే అక్కడి పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. తద్వారా తమ కుటుంబంలో వంశోద్ధారకుడు పుడతాడని అంటున్నారు. ఇది మూఢనమ్మకమని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.