AP: మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. జగన్‌కు హెలికాప్టర్ ఇవ్వొద్దని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుండి విమానయాన సంస్థలకు బెదిరింపులు వెళ్తున్నాయని మండిపడింది. ఇటీవల రాప్తాడు పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అలాగే జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందని తెలిపింది.