TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు.. ఎరువులకు కూడా కరవొచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. 'కనీసం ఎరువు బస్తా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి. రూ.266 ఉండాల్సిన యూరియా బస్తా ధర.. ఇప్పుడు రూ.325కి చేరడానికి కారణం ఏంటి?. కృత్రిమ కొరత సృష్టించిందెవరో వెంటనే విచారణ జరిపించాలి' అని డిమాండ్ చేశారు.