రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి శాపంలా మారాయని BRS అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద మండిపడ్డారు. కంచె గచ్చిబౌలి భూముల్లో కోర్టు సెలవులు ఉన్నప్పుడు గుంటనక్కల్లా చెట్లు కొట్టారని ఫైర్ అయ్యారు. ఈ భూములకు అటవీ లక్షణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ చెప్పిందని.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ₹10 వేల కోట్ల కోసం ₹170 కోట్లు బ్రోకర్లకు ప్రభుత్వం చెల్లించిందని.. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.