TG: కొత్త జిల్లాలకు తహసీల్దార్, ఇతర కార్యాలయాలకు అదనపు పోస్టులు మంజూరు చేసి ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 2017లో మున్సిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు, గ్రామా పంచాయతిలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి అవసరమైన అదనపు పోస్టులు సృష్టించలేదన్నారు. దీంతో మిగతా ఉద్యోగులపై అదనపు భారం పడుతోందన్నారు.