జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్లు త్వరలోనే తొలగించబడతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల నెంబర్ ప్లేట్‌ను శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, టోల్ ఫీజు నేరుగా ఓనర్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా నూతన సాంకేతికతను అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కొత్త టోల్ పాలసీపై 15 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. టోల్‌గేట్ల వద్ద ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.