పూజ సామగ్రిగా వినియోగించే కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ జలుబుకు కర్పూరం దివ్వ ఔషధం. జలుబు సమయంలో కాస్త కర్పూరం ఆయిల్‌ను ఛాతీ, విపుపై రాయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొబ్బరినూనెలో కర్పూరం కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శరీరంపై వాపు ఉన్న చోట ఇది నూనెలో కలిపి రాస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావం చూపుతుంది.