*ఏడాదికి కనీస పెట్టుబడి రూ.1,000. పిల్లలు మేజర్లు కాగానే ఇది సాధారణ ఖాతాగా మారుతుంది. 60 ఏళ్లు వచ్చాక పింఛను అందుతుంది.
*పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతాను తెరవొచ్చు.
*విద్య, అనారోగ్యం వంటి అవసరాల కోసం ముందస్తు ఉపసంహరణ సదుపాయం ఇస్తున్నారు.
*మూడేళ్ల కనీస లాక్-ఇన్ పీరియడ్ తర్వాత 25 శాతం వరకు మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు గరిష్ఠంగా మూడుసార్లు అనుమతిస్తారు.
*మార్కెట్ రిస్క్‌ను ఆధారంగా LC-75, LC-50, LC-25.. ఇలా ఎంపికలు ఉంటాయి.