ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే.. ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఇతర అధికారిక పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులను చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా అంగీకరించకపోవచ్చు. ఇది గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆధార్‌ను తప్పనిసరిగా తాజాగా ఉంచాలి.