గుడ్డు పోషకాలకు నిలయం. ఇందులో ఉన్న ప్రోటీన్, విటమిన్ D, A, B12, బయోటిన్, ఫోలేట్, ల్యూటీన్, జియాక్సాంథిన్ వంటి పదార్థాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, కండరాల బలానికి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. గర్భిణీలకు, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం. గుడ్డు తినడం వల్ల ఆకలిని తగ్గించడంతో బరువు నియంత్రణకు కూడా తోడ్పడుతుందట.