దానిమ్మకు కొవ్వుని కరిగించే, మెటబాలిజాన్ని పెంచే గుణం ఎక్కువ. దానిమ్మ బరువు తగ్గించడంలో సాయపడుతుంది. ఉసిరిని రోజూ పరగడుపున తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. తేనె చేర్చుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఆరెంజ్‌లో తక్కువ కేలరీలు ఉండటమే కాదు, శరీరంలో కొవ్వుని వేగంగా తగ్గించడంలో తోడ్పడుతుంది. పుచ్చకాయ డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిలోని అమైనో యాసిడ్లు కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది.