మహాకుంభమేళలో పుణ్య స్నానం ఆచరించి హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. మొదట బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం ఏపీకి చెందిన వారిగా పోలీసులు భావించారు. అయితే కొంతసేపటికి వారి గుర్తింపు కార్డుల ఆధారంగా మృతి చెందిన వారు హైదరాబాద్ నాచారానికి చెందిన వారిగా వెల్లడించారు. మృతి చెందిన వారిలో శశికాంత్, నవీన్, బాలకృష్ణ, సంతోష్, మల్లారెడ్డి, రవి, ఆనంద్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.