ముంపునకు గురైన ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

80చూసినవారు
ముంపునకు గురైన ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
భారీ వర్షాలతో నీట మునిగిన పొలాల్లో వరద నీరు బయటకు పోయిన తర్వాత ఉద్యాన పంటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
👉లేత తోటల్లో మొక్కలు చనిపోయిన చోట తిరిగి నాటుకోవాలి.
👉కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి వేయాలి.
👉మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి.
👉వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్