కేరళలో హెపటైటిస్-ఏ వైరస్ కేసుల విజృంభన తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. హెపటైటిస్ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. అలసట, కడుపునొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు, చర్మం, గోర్లు, కళ్లు, మూత్రం పసుపు రంగులో ఉండటం ఈ వ్యాధి లక్షణాలని సూచించారు.