హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో హనుమాన్ జయంతి ఒకటి. ఈ పండుగను ఏప్రిల్ 12న జరుపుకునేందుకు హిందూ భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే ఆ రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున ఏ జంతువుకి హాని చేయకూడదు. మాంసాహారం, మద్యం, మత్తు పదార్థాలను ముట్టుకోకూడదు. ఇతరులతో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఆ రోజున శాంతి, పవిత్రత పాటించడం చాలా మంచిది.