TG: పేదల కోసం ప్రభుత్వం కట్టిచ్చే ఇంటిని ఇప్పటికే పొందిన వారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదని ఇటీవల స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి చిన్న సవరణ చేసింది. 1994 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1994కు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఇంటిని పొందిన వారు మాత్రం ఈ పథకానికి అనర్హులవుతారు.