తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్‌లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని, అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని అన్నారు. దానిని సాకుగా చూపుతూ ఇప్పుడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.