ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం పి.చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8, సీడీ దేశముఖ్ 7, డాక్టర్ మన్మోహన్ సింగ్ 6, టీటీ కృష్ణమాచారి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు.