TG: సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా చూడాలి. 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిపాలనలో కూడా మార్పు రావాలని రేవంత్ అధికారులను కోరారు.