యూపీలో ఓ యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అన్షుల్ (19) అనే యువకుడు ఇంటి నుంచి వస్తుండగా ఒక్కసారిగా పలువురు దుండగులు అతడిపై దాడి చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంటపడి కత్తులతో పొడిచి చంపేశారు. అయితే హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో నమోదు కాగా వైరల్‌గా మారాయి.