TG: గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు ప్రాంతాల్లో లబ్దిదారులకు కేటాయించలేదు. ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి. ఎల్-2 జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సూచన, గెజిటెడ్ అధికారులు విచారణతో ఈ ఇళ్లను అర్హులకు కేటాయించనున్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు ఉంటే వాటిని లబ్దిదారులే పూర్తిచేయాల్సి ఉంటుంది.