తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర రుణమాఫీని చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర BJP ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపినట్లు వివరించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవని విమర్శించారు.