వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: హరీష్ రావు

82చూసినవారు
వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: హరీష్ రావు
సమస్యలను పరిష్కరించాలని కోరిన 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేయడాన్ని మాజీమంత్రి హరీశ్ ఖండించారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు 'పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని పోలీసుల కష్టాలు, ఇంట్లో భార్య, బిడ్డల బాధ నాకు తెలుసు' అని ఊదరగొట్టిన రేవంత్ ఇప్పుడు పోలీసులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి బాధలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని రేవంత్ మాట్లాడిన ఓ వీడియో Xలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్