వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి: గుత్తా

55చూసినవారు
వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి: గుత్తా
తెలంగాణలో అర్హులైన వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంపన్నులు, పన్నులు కట్టేవారిని పథకం నుంచి తొలగించాలన్నారు. రైతు భరోసా నుంచి వ్యవసాయం చేయని భూములు తొలగించాలన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని..చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్