ఎండు చేపల గురించి వింటేనే చాలా మందికి నోరూరుతుంది. ఈ చేపల్లో ఉండే ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఎండు చేపలు ఆరోగ్యానికి మంచివే అయినా కొందరు మాత్రం వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వారు ఎవరంటే.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్ బాధితులు, మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారు తీసుకోవడం వల్ల వీటిలో ఉండే సోడియం వల్ల మరిన్ని ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.