TG: నారాయణపేటలో మంగళవారం చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో వివాహం నిమిత్తం బ్యాంక్ నుంచి రూ.4 లక్షలు విత్ డ్రా చేశాడు. తన ద్విచక్ర వాహనంపై డబ్బు ఉన్న బ్యాగ్‌ను విడిచి ఓ బేకరీ షాపునకు వెళ్లాడు. అటువైపు వెళ్తున్న ఓ వ్యక్తి బైక్‌పై ఉన్న బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.