ఉప్పల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్.. వీడియో వైరల్

50చూసినవారు
ఉప్పల్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. రాఘవేంద్ర కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణపురి కాలనీల్లోని పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. మరికొన్ని ఇళ్లలో సోదాలు చేశారు. విలువైన వస్తువులు దొంగిలించలేకపోవడంతో పెద్ద నష్టమే తప్పింది. దీంతో అక్కడి నివాసితులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో భయపడ్డ స్థానికులు.. కాలనీల్లో పోలీసుల గస్తీ పెంచాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్