TG: వరంగల్ జిల్లాలోని ఓ వైన్ షాపులో దొంగలు అందిన కాడికి ఖరీదైన మద్యాన్ని ఎత్తుకెళ్లారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని వైన్ షాపులో చోరీ ఏనుగల్లులోని రాజన్న వైన్‌షాపులో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. కౌంటర్లోని రూ.51,000 నగదు, రూ.33,400 విలువ గల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దొంగల కదలికలన్నీ సీసీ కెమారాల్లో రికార్డయ్యాయి. వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.