హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో చైన్ స్నాచింగ్ జరిగింది. టెంపుల్ బస్ స్టాప్ వద్ద ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా చైన్ స్నాచర్ వచ్చి దాహంగా ఉందన్నాడు. దీంతో ఆ మహిళ నీళ్లు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లగానే అతడు కూడా ఆ మహిళ వెంటే వెళ్లి ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.