ఈసారి జరిగిన ఢిల్లీ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని ఢిల్లీ సీఎం అతిశి అన్నారు. కల్కాజీ నియోజకవర్గంలో ఆప్ తరపున బరిలో నిలిచిన ఆమె.. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘చెడుపై మంచి చేస్తున్న యుద్దమే ఈ ఎన్నికలు. పోకిరితనంపై పనిమంతులు చేస్తున్న పోరాటం ఈ ఎన్నికలు. కల్కాజీ ప్రజలు నాతో ఉంటారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటి ఉంటారు’ అని పేర్కొన్నారు.