TG: ఢిల్లీలో ఆప్ ఓటమిపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ తమకే కావాలని కోరుకోవాడమే ఇక్కడ పెద్ద సమస్య అని ఆయన ఆన్నారు. 'హరియాణాలో ఆప్ వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ అదే పని చేయడం వల్ల ఆప్ ఓటమిపాలైంది. ఈ మొత్తం వ్యవహారంలో చివరికి బీజేపీ లబ్ది పొందుతోంది. అందుకే అంతా కలిసివచ్చి ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు వస్తాయి' అని రేవంత్ పేర్కొన్నారు.