ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఇలా..

60చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఇలా..
TG: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. ఒక లబ్ధిదారుడికి 25 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసే ధ్రువపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దారు కార్యాలయంలో ఇవ్వాలి. వారు ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి, టోకెన్లను అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. కాగా ఇసుక కొరత రాకుండా, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పిటికే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్