TG: గత ప్రభుత్వం మాదిరిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని బొమ్మలు చూపించి వెళ్లిపోయే ప్రభుత్వం తమది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైన ప్రేమ, అభిమానం చూపించారో.. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ అదే రకమైన ప్రేమాభిమానాలు చూపించాలన్నారు.