శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం(ఆగస్టు 16) రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇక సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5.57 గంటల నుంచి 8.14 గంటల వరకు ఉంది. వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 3.08 గంటల వరకు ఉంది. కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమై రాత్రి 8.22 వరకు ఉంది. వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11.22 గంటల నుంచి తెల్లవారుజాము 1.18 గంటల వరకు ఉంది.