ఆప్‌ పతనానికి ఇది ఆరంభం: ప్రశాంత్‌ భూషణ్

84చూసినవారు
ఆప్‌ పతనానికి ఇది ఆరంభం: ప్రశాంత్‌ భూషణ్
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్‌ మాజీ నేత, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందించారు. ‘పారదర్శకం, ప్రజాస్వామ్యం, జవాబుదారితనం కోసం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సిన పార్టీని.. కేజ్రీవాల్‌ చాలా తొందరగా అవినీతిమయం చేశారు. తన కోసం రూ.45 కోట్లతో ‘శీష్ మహల్‌’ నిర్మించుకున్నారు. అవినీతి మార్గంలో ప్రభుత్వాన్ని నడిపారు. ఆప్‌ పతనానికి ఇది ఆరంభం ’అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్