మన దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా కోల్‌కతాలోని హౌరా జంక్షన్ నిలిచింది. ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య, విస్తీర్ణంలో ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనిని 1854లో నిర్మించారు. హౌరా స్టేషన్‌లో 23 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషన్ అద్భుతమైన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది తూర్పు భారతదేశాన్ని మిగిలిన రైల్వే వ్యవస్థతో అనుసంధానించి ఉంది.