రోజంతా బస్సులో ప్రయాణం చేస్తేనే అలసిపోతాం. అలాంటిది 1957-1976 మధ్య కాలంలో 50 రోజుల పాటు బస్సులో ప్రయాణించి, తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు. భారతదేశంలోని కలకత్తా-లండన్ మధ్య ఒక సాధారణ బస్సు సర్వీస్ ఉంది. కలకత్తా నుంచి 50 రోజుల పాటు 32,700 కి.మీ ప్రయాణించి లండన్ చేరుకునేవారు. దేశంలో ఇదే అతి పొడవైన ప్రయాణంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ బస్సులోనే స్లీపింగ్ బంక్‌లు, వంట గది ఉన్నాయి. ప్రయాణం, ఆహారం, వసతితో కలిసి రూ.1933(£145) తీసుకునేవారు.