ఎర్ర సముద్ర తీరాన దట్టమైన అడవిలో కొండ ప్రాంతమది. దేవర (ఎన్టీఆర్), భైరా (సైఫ్ అలీఖాన్) తన స్నేహితులు (శ్రీకాంత్, చాకో) కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంది. వీరు మురుగ (మురళీ శర్మ) దగ్గర డబ్బు కోసం అధికారుల కళ్లు కప్పి సరుకులు తరలిస్తుంటారు. అయితే మురుగ ఇచ్చే పనిని దేవర వ్యతిరేకిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి భైర ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. సముద్రంలో వేటకు వెళ్లకూడదని దేవర ఎందుకు ఆంక్షలు విధిస్తాడు? భైరా దేవరను ఎందుకు చంపాలనుకున్నాడు? దేవర కొడుకు వర పిరికి వాడిలా ఎందుకు మారాడు? వరతో తంగం (జాన్వీకపూర్) ప్రేమాయణం ఎలా సాగింది? సముద్రంలోకి వెళ్లిన దేవర తిరిగి వచ్చాడా? నాలుగు గ్రామాల కోసం వర ఏం చేశాడు? అనేదే ఈ సినిమా స్టోరీ.