ప్రతి పది మందిలో ఒకరు కాలేయ సమస్య బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనికి జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, పోషకాలు తీసుకోకపోవడం, మద్యం అతిగా తాగడం, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం ప్రధాన కారణాలని తెలిపారు. అందుకే ఈ ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవ థీమ్‌గా 'ఆహారమే మందు' అని నిర్ణయించారు. దీనిని బట్టే కాలేయ రక్షణలో ఆహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అవగతం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.